వాటే షాట్ గురూ! క్రికెట్ లో సరికొత్త షాట్ కనిపెట్టిన కుర్రోడు..వీడియో వైరల్!!

వాటే షాట్ గురూ! క్రికెట్ లో సరికొత్త షాట్ కనిపెట్టిన కుర్రోడు..వీడియో వైరల్!!
x
వైరల్‌ అవుతున్న ఓ యువకుడు బౌండరీ షాట్
Highlights

అనూహ్యంగా వచ్చే బంతిని అంతే అద్భుతంగా బౌండరీ లైన్ దాటించడమే క్రికెట్ లో మజా. ఈ బాల్ కి ఈ షాట్ అనే పధ్ధతి క్రికెట్ బుక్ లో చాలా రాసుంటుంది. కానీ,...

అనూహ్యంగా వచ్చే బంతిని అంతే అద్భుతంగా బౌండరీ లైన్ దాటించడమే క్రికెట్ లో మజా. ఈ బాల్ కి ఈ షాట్ అనే పధ్ధతి క్రికెట్ బుక్ లో చాలా రాసుంటుంది. కానీ, అప్పుడప్పుడు కొత్తరకంగా షాట్ కొట్టి అభిమానులను ఉర్రూతలూగిస్తారు బ్యాట్స్ మెన్. ఆ విధంగా కొన్ని షాట్లు క్రికెట్ ప్రపంచంలో చరిత్ర సృష్టించాయి. ఉదాహరణకు ధోనీ హెలికాప్టర్ షాట్. బ్యాటును గిర్రున తిప్పి కంటికి కనిపించనంత వేగంతో బాల్ బౌండరీ దాటించడం ఈ షాట్ ప్రత్యేకత. ఇది ధోనీ హెలికాప్టర్ షాట్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే షాట్.

ఇప్పుడు తాజాగా ఓ కుర్రాడు తన రెండు కాళ్ళ మది నుంచి వికెట్ కీపర్ వెనుకగా బౌండరీ లైన్ దాటించాడు. ఆ షాట్ చూస్తె అసలు మతి పోతుంది. వేగంగా వస్తున్నా బంతికి ఎదురెళ్ళి.. రెండు కాళ్ళను ఎడంగా చాచి.. ఆ కాళ్ళ మధ్యలో బంతిని బ్యాటుతో దొరక బుచ్చుకుని వికెట్ కీపర్-స్లిప్ ఫీల్డర్ల మధ్య నుంచి కనురెప్ప పాటులో బంతిని బౌండరీ దాటించాడు. ఈ షాట్ ఇప్పుడు నేట్టింట వైరల్ గా మారింది. ఇంకా ఈ షాట్ కు ఏం పేరు పెట్టాలనేది పాపం అభిమానులు నిర్నయిన్చుకోలేకపోతున్నారు. కానీ, అద్భుతమైన షాట్ కనిపెట్టాడంటూ ఆ బ్యాట్స్మెన్ ని పొగడ్ట్లలతో మున్చేస్తున్నారు. మరెందుకాలస్యం మీరూ ఆ షాట్ చూసి ముచ్చట పదిపొంది..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories