Viral Video: జింకపై సింహాలు అటాక్‌ చేస్తే ఎలా ఉంటుందో చూశారా? వైరల్‌ వీడియో..

Viral Video: జింకపై సింహాలు అటాక్‌ చేస్తే ఎలా ఉంటుందో చూశారా? వైరల్‌ వీడియో..
x
Highlights

అడవి మృగాలలో సింహాలు, పులులు దాడులు ఎంతటి భయానకమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ముఖ్యంగా సింహాల వేట ధోరణి విశేషంగా ఉంటుంది. ఆకలితో...

అడవి మృగాలలో సింహాలు, పులులు దాడులు ఎంతటి భయానకమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ముఖ్యంగా సింహాల వేట ధోరణి విశేషంగా ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు వీటి దాహం ఏ జంతువైనా అవతల చూడదు. లక్ష్యాన్ని చేరుకునే వరకూ చాకచక్యంగా వెంటాడతాయి. వేటలో ఎప్పుడూ వేగం, సమర్ధత, సమయపాలన కీలకం. కొన్ని సార్లు అవి మైలుల దూరం వేటాడుతూ పరిగెడతాయి, మరికొన్నిసార్లు క్షణాల్లోనే తమ లక్ష్యాన్ని దెబ్బ తీసి నేలకొరిగిస్తాయి.

ఈ తరహా సన్నివేశాలను తరచూ డిస్కవరీ చానల్‌, నేషనల్ జియోగ్రాఫిక్‌, సోషల్ మీడియా వేదికల ద్వారా చూసే ఉంటాం. ఇటీవలి కాలంలో అడవి ప్రాణుల బలమైన సన్నివేశాలు నెట్టింట ఎక్కువగా వైరల్‌ అవతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో... ఓ జిరాఫీ దారిలో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ సింహాల గుంపు దాన్ని టార్గెట్ చేసింది.

నాలుగైదు సింహాలు వ్యూహాత్మకంగా జిరాఫీని చుట్టుముట్టాయి. ఒక్కసారిగా దానిపై దూకి, దాని కాళ్లను గట్టిగా పట్టుకుని వేల్లాడపడ్డాయి. ఎంతటి శక్తిమంతమైన జంతువైనా, అలాంటి పరిస్థితుల్లో నిలబడటం కష్టం. జిరాఫీ సింహాల బరువు నుంచి తప్పించుకునేందుకు ప్రాణపణంగా పోరాడింది. కానీ వాటి గోర్లు, పంజాలు తట్టుకోలేక... కొద్దిసేపటికే అసహాయంగా నేలకొరిగింది.



ఈ హృదయవిదారక దృశ్యాలను అటవీ ప్రాంతానికి సఫారీకి వెళ్లిన కొందరు సందర్శకులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రకృతిలో వేట సర్వసాధారణమే అయినా.. ఇంతటి కృరత్వం కూడా దాగి ఉండడమే బాగాలేదు అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories