ఢిల్లీలో అల్లర్లపై ప్రధాని స్పందన.. నా సోదర సోదరీమణులంటూ..

ఢిల్లీలో అల్లర్లపై ప్రధాని స్పందన.. నా సోదర సోదరీమణులంటూ..
x
Highlights

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అందులో.. ప్రశాంతంగా ఉండాలని ఢిల్లీ ప్రజలకు మోదీ...

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అందులో.. ప్రశాంతంగా ఉండాలని ఢిల్లీ ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. 'శాంతి మరియు సామరస్యం మనకు ప్రధానమైనవి అన్ని సమయాల్లో శాంతి మరియు సోదరత్వాన్ని కాపాడుకోవాలని నా సోదరీమణులు మరియు ఢిల్లీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశాంతతో ఉండటం చాలా ముఖ్యం.. సాధారణ స్థితి త్వరగా పునరుద్ధరించబడుతుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై విస్తృతమైన సమీక్ష జరిగింది. పోలీసులు మరియు ఇతర ఏజెన్సీలు శాంతి మరియు సాధారణ స్థితి కోసం కృషి చేస్తున్నారు' అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా ఈశాన్య ఢిల్లీలో మూడు రోజుల హింసాకాండ నేపథ్యంలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే..

ఇప్పటికే ఆందోళనకారుల దాడిలో ఒక హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి మరవకముందే.. తాజాగా మరో పోలీస్ అధికారి ఈ అల్లర్లకు బలయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న అంకిత్ శర్మ(26) అనే పోలీస్ అధికారి అల్లర్లకు తీవ్రంగా గాయపడి మృతిచెందారు. కాగా ఇప్పటికే 50 మంది పోలీసులు సహా 260 మంది ఈ ఆందోళనల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం నుండి ప్రారంభమైన ఈ ఆందోళనలు మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.. అందులో ఆందోళనను అణచివేయడానికి ఆర్మీని పిలిచి.. ఢిల్లీ ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే కర్ఫ్యూ విధించాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. పోలీసులు "పరిస్థితిని నియంత్రించలేకపోతున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories