హైకోర్టు జడ్జీ పదవుల ఖాళీలపై సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి

హైకోర్టు జడ్జీ పదవుల ఖాళీలపై సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి
x
Minister Ravi Shankar
Highlights

న్యాయముర్తుల పదవులు ఖాళీలపై పార్లమెంట్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానం ఇచ్చారు....

న్యాయముర్తుల పదవులు ఖాళీలపై పార్లమెంట్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 22 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. హైకోర్టులో న్యాయమూర్తుల బదిలీ, పోస్టు భర్తీ ప్రక్రియను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే చేపడతారని వెల్లడించారు. 6 నెలల సమయాన్ని విధిగా పాటించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి తెలిపారు.

న్యాయమూర్తి పోస్టుల భర్తీ అనేది ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య నిరంతరం జరిగే పక్రియేనని అన్నారు. కేంద్ర స్థాయిలో సంప్రదింపులు జరిపి అనుమతులు పొందాల్సి రావడంతో జాప్యం జరగుతుందని మంత్రి అన్నారు. న్యాయమూర్తుల సంఖ్యాబలం పెంపు, పదవీవిరమణ వంటి కారణాల వలన హైకోర్టు జడ్జీల పదవులకు ఖాళీలు ఉంటున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories