విజిలెన్స్ దాడుల్లో బుక్కైన బిహార్ ప్రభుత్వ అధికారులు

Vigilance Officials Raids | Telugu News
x

విజిలెన్స్ దాడుల్లో బుక్కైన బిహార్ ప్రభుత్వ అధికారులు

Highlights

Bihar: రూ. 4 కోట్లకు పైగా నగదు స్వాధీనం

Bihar: విజిలెన్స్ దాడుల్లో ముగ్గురు బిహార్ ప్రభుత్వ అధికారులు అడ్డంగా బుక్ అయ్యారు. వీరి నుంచి 4 కోట్లకు పైగా నగదును విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాట్నా, కిషన్ గంజ్ ప్రాంతాల్లో వీరికి చెందిన పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కిషన్ గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సంజయ్ కుమార్ రాయ్, ఆయన సబార్డినేట్ ఉద్యోగులకు చెందిన ఇళ్లు, ఇతర చోట్ల ఈ సోదాలను నిర్వహించారు. రాయ్ ఇంట్లో 1 కోటి రూపాయల వరకు దొరికిందని, ఆయన సబార్డినేట్ వద్ద 3 కోట్ల రూపాయల వరకు దొరికిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories