Viral video: ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా 2 రైళ్లు..ఘోర ప్రమాదం వైరల్ వీడియో

Viral video: ఒకే ట్రాక్ పై  ఎదురెదురుగా 2 రైళ్లు..ఘోర ప్రమాదం వైరల్ వీడియో
x
Highlights

Viral video: రైలు ప్రమాదాల సంఖ్య తగ్గేలా కనిపించడం లేదు. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరో ఘోర రైలు ప్రమదం జరిగింది. ఒకే ట్రాక్ పై రెండు...

Viral video: రైలు ప్రమాదాల సంఖ్య తగ్గేలా కనిపించడం లేదు. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరో ఘోర రైలు ప్రమదం జరిగింది. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజన్ పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ, పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. కానీ నష్టం మాత్రం జరిగింది. రైలు ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది.


ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణం మాత్రం అర్థం కాలుదు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఒకదానికొకటి ఎలా ఎదురెదురుగా వచ్చాయన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ఇది గూడ్స్ రైలు కావడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ ప్యాసింజర్ రైలు అయితే ఎలా ఉండేదని సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రైళ్లు ట్రాక్ పై వచ్చిన ఘటన యూపీలోని ఫతేపూర్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories