Video: జమ్ముకశ్మీర్‌‌లోని ఓ నదీ ప్రవాహంలో చిక్కుకున్న బాలుడు.. కాపాడిన ఇండియన్ ఆర్మీ

Video: జమ్ముకశ్మీర్‌‌లోని ఓ నదీ ప్రవాహంలో చిక్కుకున్న బాలుడు.. కాపాడిన ఇండియన్ ఆర్మీ
x

Video: జమ్ముకశ్మీర్‌‌లోని ఓ నదీ ప్రవాహంలో చిక్కుకున్న బాలుడు.. కాపాడిన ఇండియన్ ఆర్మీ

Highlights

జమ్ముకశ్మీర్‌‌లోని రాజౌరీలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఒక బాలుడిని ఇండియన్ ఆర్మీ రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

జమ్ముకశ్మీర్‌‌లోని రాజౌరీలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఒక బాలుడిని ఇండియన్ ఆర్మీ రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఇండియన్ ఆర్మీ బాలుడిని రక్షించడంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు పెరగిపోవడం, నదులు ఉప్పొంగడం సర్వసాధరణం అయిపోయింది. అయితే ఈ వరద నీటిలో మనుషులు, జంతువులతో పాటు వాహనాలు కూడా చిక్కుకుపోతున్నాయి. అదృష్టవశాత్తూ కొంతమంది రక్షించబడితే మరికొంతమంది దారుణంగా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌‌లోని రాజౌరీలో నది చాలా భయానకంగా ప్రవహిస్తుంది. ఈ నది మధ్యలో ఒక బాలుడు ఉండిపోయాడు. చాలా సేపటివరకు బాలుడు ఒక్కడే ఆ నీటి మధ్యలో ఒక రాయిపైన నిలబడి బయటపడడానికి ప్రయత్నించాడు. కానీ నది ప్రవాహం అంతకంతకు పెరిగిపోవడంతో బాలుడు అక్కడే చిక్కుకుపోయారు.

బాలుడు నది ప్రవాహంలో చిక్కుకుపోవడంతో స్థానికులు ఆర్మీకి ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే హెలికాఫ్టర్‌‌లో రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బంది కాసేపటి తర్వాత ఆ బాలుడిని రక్షించి ఒడ్డుకు దించారు. అదృష్టవశాత్తూ ఆ నది మధ్యలో కొంత రాళ్ల ప్రాంతం ఉండటం వల్ల ఆ బాలుడు అక్కడ ఉండగలిగాడు. సిబ్బంది కూడా అతన్ని రక్షించగలిగారు. లేదంటే బాలుడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవారని స్థానికులు చెప్పారు.



Show Full Article
Print Article
Next Story
More Stories