Vice Presidential Election: రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలు

Vice Presidential Election: రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలు
x

Vice Presidential Election: రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలు

Highlights

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు ఓటింగ్ జరగనుంది. NDA నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు అనుభవం, నేపథ్యాలు వేరువేరు. లోక్‌సభలో NDAకి మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రతిపక్షాలు కూడా సుదర్శన్ రెడ్డికి ఐక్యంగా మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు ఓటింగ్ జరగనుంది. NDA నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు అనుభవం, నేపథ్యాలు వేరువేరు. లోక్‌సభలో NDAకి మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రతిపక్షాలు కూడా సుదర్శన్ రెడ్డికి ఐక్యంగా మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికలకు ముందునుంచే అధికార ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్ధి సభ్యుల మద్దతు కూడగట్టడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ఈ ఆసక్తికరమైన ఎన్నికల్లో ప్రధాన, ప్రతిపక్ష నేతలు తమ విజయంపై నమ్మకంగా ఉన్నాయి. గత నెలలో జగదీప్ థన్కర్ అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు భారత ఉపరాష్ట్ర పదవికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.


ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు సిపి రాధాకృష్ణన్, తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ జరుగుతోంది. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికిని బలోపేతం చేయడానికి పార్టీ వ్యూహత్మకంగా ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపింది. మరోవైపు న్యాయవ్యవస్థలో సుదర్శన్ రెడ్డి.. నీతి, నిజాయితీ కలిగిన న్యాయమూర్తిగా పేరుపొందారు.

ఇది 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికవుతారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలకు ఎటువంటి పాత్ర లేదు. 2025 లో ఖాళీగా ఉన్న పదవులను మినహాయించి ఉభయ సభలకు 782 మంది ఎంపీలు ఉంటారు. వీరిలో 543 మంది లోక్‌సభ, 233 మంది రాజ్యసభ, 12 మంది నామినేటెడ్ సభ్యులు. ప్రతి ఎంపీ ఓటు విలువ ఒకేలా ఉంటుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒకే బదిలీ చేయగల ఓటు ఉపయోగించి పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో రహస్య బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో ర్యాంక్ చేస్తారు. ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికి పైగా కలిగి ఉండాలి. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ లభించకపోతే.. అత్యల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగించి, అతని బ్యాలెట్ పత్రాలను తదుపరి అందుబాటులో ఉన్న ప్రాధాన్యతలకు బదిలీ చేస్తారు. అభ్యర్థి మెజారిటీ సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఓటింగ్‌ను పర్యవేక్షించడానికి రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. అతను సాధారణంగా సీనియర్ పార్లమెంటరీ అధికారి. ఈ ఓటింగ్ 1974 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమాలలోని 8వ నిబంధన ప్రకారం పార్లమెంట్ హౌస్‌లో జరుగుతుంది.

లోక్‌సభలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏకు బలమైన మెజారిటీ ఉందని, పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏ అభ్యర్దికి మద్దతు ఇస్తున్నాయని బీజేపీ చెబుతోంది. దీని కారణంగా సీపీ రాధాకృష్ణన్ విజయం పెద్ద ఇబ్బందికాదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ గతంలో కన్నా మరింత ఐక్యంగా, బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశాయి. దీనితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు ఎంఐఎం పార్టీ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో డిఎంకే ఎవరికి మద్దతిస్తుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. బీజేడీ కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయడంపై ఆయన ఇంకా అభిప్రాయాన్ని ప్రకటించలేదు. వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ఇస్తామని తెలిపింది.

ఇప్పటికే ఎన్డీఏ తమ ఎంపీల కోసం రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ప్రధాని మోడీతో పాటు పలు పార్టీల ఎంపీలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో, ఎంపీలకు ఓటింగ్ ప్రక్రియ, రహస్య ఓటింగ్ గురించి వివరంగా చెప్పారు. ఏ చిన్న నిర్లక్ష్యం అయినా ప్రతిపక్షానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఎంపీలు జాగ్రత్తగా ఓటు వేసేలా ఎన్డీఏ నాయకత్వం తమ ఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చింది. మరోవైపు, ప్రతిపక్షం తన ఎంపీల మధ్య ఐక్యతను చాటడానికి వరుసగా సమావేశాలు నిర్వహించింది.

ప్రస్తుతం ఉన్న గణాంకాలను పరిశీలిస్తే, లోక్‌సభలో NDA ఎంపీల సంఖ్య 293, రాజ్యసభలో 130. వీరితో పాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. దీన్నిబట్టి NDAకి మొత్తం 435 మంది ఎంపీలు ఉన్నారు. 782 మంది ఎంపీలు ఎన్నికల్లో పాల్గొంటారు. మెజారిటీ సంఖ్య 392. క్రాస్ ఓటింగ్ లేకపోతే.. తమ విజయం ఖాయమని ఎన్డీఏ లెక్కలేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories