ప్రారంభమైన ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ పోలింగ్

Vice President Election Polling Started
x

ప్రారంభమైన ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ పోలింగ్ 

Highlights

Vice President Election: సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌

Vice President Election: భార‌త 16వ ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భ‌వ‌నంలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది. NDA కూటమి త‌ర‌పున ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్నర్ జ‌గ‌దీప్ ధన్‌ఖర్, విప‌క్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. TMC మిన‌హా లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు. ఈ నెల 11వ తేదీన కొత్త ఉప రాష్ట్రప‌తి ప్రమాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ప్రస్తుత ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ప‌ద‌వీ కాలం ఆగ‌స్టు 10తో ముగియ‌నుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories