చిన్నారుల కరోనా వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్

Vaccines for childrens
x

చిన్నారుల కరోనా వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్

Highlights

Childrens Vaccines: 6-12 ఏళ్ల వారి కోసం కొవాగ్జిన్‌.. 5-12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌

Childrens Vaccines: కరోనా వ్యాక్సిన్లు ఇక చిన్నారులకు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇవ్వడానికి DCGI అంగీకరించింది. దీంతో పాటు 5-12 ఏళ్ల వారికి బయోలాజికల్ - ఇ సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్‌ టీకా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవాగ్జిన్‌ టీకాను ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు.

అయితే టీకా పంపిణీ మొదలైన తర్వాత తొలి రెండు నెలల పాటు ప్రతి 15 రోజులకోసారి భద్రతా డేటాను అందజేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 5 నెలల పాటు నెలకోసారి ఈ వివరాలను ఇవ్వాలని సూచించింది. మరోవైపు 12 ఏళ్లు పైబడిన పిల్లలకు జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి ఇచ్చేందుకు కూడా DCGI ఓకే చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories