Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సొరంగం వద్ద రెస్క్యూ స్పీడప్.. త్వరలోనే..బయటకు..

Uttarakhand Tunnel Trapped Workers Pulled Out
x

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సొరంగం వద్ద రెస్క్యూ స్పీడప్.. త్వరలోనే..బయటకు..

Highlights

Uttarakhand Tunnel: త్వరలో కార్మికులను చేరుకుంటామంటున్న అధికారులు

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు అధికారులు చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కన్పిస్తోంది. వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. నేలకు సమాంతరంగా చేపట్టిన మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ 10 మీటర్లు తవ్వితే కార్మికుల వద్దకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నేలకు సమాంతరంగా మొదట చేపట్టిన పనులు ఆగర్‌ యంత్రం బ్లేడ్లు విరిగిపోవడంతో అర్థాంతరంగా పనులు ఆగిపోయాయి.

దీంతో 12 మంది బొగ్గు గనుల్లో మార్గాలను తవ్వడంలో నిపుణులను పిలిపించిన అధికారులు... వారితో తవ్వకాలు చేపట్టారు. ఇప్పటి వరకూ 50 మీటర్ల తవ్వకం పూర్తయినట్లు సహాయక బృందంలో అధికారులు వెల్లడించారు. కూలీలను చేరుకోవాలంటే మరో 10 మీటర్ల తవ్వాల్సి ఉందన్నారు. ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోతే ఈ రోజు సాయంత్రానికి రెస్క్యూ కీలక దశకు చేరుకుంటాయని తెలిపారు.

ఆగర్‌ యంత్రంతో మధ్యలోనే విరిగి చిక్కుకుపోవడంతో అధికారులు మ్యానువల్‌ డ్రిల్లింగ్‌ చేపట్టి యంత్రాన్ని దాని నుంచి తొలగించారు. నిన్న రాత్రి నుంచి ర్యాట్‌ హోల్‌ మైనర్లతో తవ్వకాలు ప్రారంభించారు. మరోవైపు కొండ పైభాగం నుంచి చేపట్టిన డ్రిల్లింగ్‌ పనులు కూడా ఇప్పటికే 42 మీటర్లు పూర్తయ్యాయి.

నిట్టనిలువుగా 86 మీటర్లు తవ్వాల్సి ఉండగా దాదాపు సగం పని పూర్తయినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. కూలీలను బయటకు తెచ్చేందుకు 1.20 మీటర్ల వెడల్పైన గొట్టాలను వీటిద్వారా ప్రవేశపెడుతున్నారు. ఇటీవల కార్మికులు ఉన్న ప్రాంతానికి ఎండోస్కోపి తరహాలోని కెమెరాను పంపించి అధికారులు వారితో మాట్లాడారు. వారి కోసం ఆహారం, పానీయాలను పంపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories