Lucknow: ఎంగిలి వాడకండి అంటువ్యాధులొస్తాయి.. అధికారి ఆదేశాలు

Lucknow: ఎంగిలి వాడకండి అంటువ్యాధులొస్తాయి.. అధికారి ఆదేశాలు
x
Highlights

ఫైళ్లు, ఇతర పత్రాల పేజీలను తిప్పడానికి లాలాజలం వాడటం మానేయాలని అధికారులు, ఉద్యోగులను కోరుతూ రాబరేలికి చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (సిడిఓ) ఉత్తర్వులు...

ఫైళ్లు, ఇతర పత్రాల పేజీలను తిప్పడానికి లాలాజలం వాడటం మానేయాలని అధికారులు, ఉద్యోగులను కోరుతూ రాబరేలికి చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (సిడిఓ) ఉత్తర్వులు జారీ చేశారు. పేజీలను తిప్పటానికి ఎంగిలి ఉపయోగించే అలవాటును మానేయటం ద్వారా అంటురోగాలను నివారించొచ్చనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీడీఓ అభిషేక్‌ గోయల్‌ తెలిపారు. ఈ మేరకు ఓ ఆర్డర్ జారీ చేశారు. అందులో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న చాలా మంది డాక్యుమెంట్లు, ఫై‍ల్లను తిప్పడానికి ఎంగిలి ఉపయోగిస్తున్నారని, తద్వారా వారు అంటురోగాల బారిన పడే అవకాశం ఉందని..

అందువల్ల.. సంక్రమణ వ్యాధులను నివారించడానికి ఫైళు పేజీలని తిప్పడానికి నీటి స్పాంజిలను ఉపయోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.. "సంబంధిత కార్యాలయాలలో ఈ కఠినమైన విధానాన్ని అమలు చేయాలనీ.. ఈ మేరకు మూడు రోజుల్లో సిడిఓ కార్యాలయానికి సమ్మతి నివేదికను అందించాలని పేర్కొన్నారు. నిజానికి ఈ ఆర్డర్ నెల పదవ తేదీన జారీ కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆర్డర్స్‌ కాపీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వాస్తవానికి చాలా మంది ప్రభుత్వ అధికారులు ఈ తరహా విధానాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగిస్తున్నారు. దీనిని పలుమార్లు ఉన్నతాధికారులు గమనించి నీటి స్పాంజిలను ఏర్పాటు చేశారు. అయినా కొందమంది అధికారులు మాత్రం ఈ అలవాటును మారడం లేదు. కొందరు వ్యక్తులు ఈ తరహా పద్ధతిని ప్రత్యక్షంగా చూసి అధికారులతో చిర్రుబుర్రులాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

దాదాపు పదేళ్ల కిందటి నుంచి ఈ పద్ధతి కొద్దిగా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ప్రజలు, ఉన్నతాధికారుల ఆంక్షల తరువాత ఇది జరిగింది. ఇక ఈ పద్ధతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాక అన్ని రిటైల్ షాపులు, ఆసుపత్రులలో సరఫరా చేసే మందుల షాపుల వద్ద కూడా కొనసాగుతోంది. అయితే ప్రజలు దీని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దాంతో ఇదో చిన్న సమస్యగా మిగిలిపోయింది. తాజాగా అభిషేక్‌ గోయల్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories