కాంగ్రెస్‌ను ఉర్మిళ మదోండ్కర్‌ ఎందుకు వీడింది?

కాంగ్రెస్‌ను ఉర్మిళ మదోండ్కర్‌ ఎందుకు వీడింది?
x
Highlights

బాలీవుడ్ సినీ నటి ఊర్మిళా మదోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో జరుగుతున్న చిల్లర రాజకీయాలతో విసిగిపోయానని, అందుకే పార్టీ...

బాలీవుడ్ సినీ నటి ఊర్మిళా మదోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో జరుగుతున్న చిల్లర రాజకీయాలతో విసిగిపోయానని, అందుకే పార్టీ తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఉత్తర ముంబై లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెపై బీజేపీ సీనియర్ నేత గోపాల్ శెట్టి విజయం సాధించారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సైతం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. అయన మార్గంలోనే పలువురు నేతలు తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఊర్మిళ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, రంగీలా, జుదాయి, మస్త్ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాల్లో ఊర్మిళ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రంగీలా చిత్రం ఆమె ఇమేజ్‌ను ఒక్కసారిగా పెంచిన విషయం తెల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories