సివిల్ సర్వీసెస్ పరీక్షలకు మరోసారి గడువు పెంపు

Class 10 exams from today time and rules are as follows
x

 SSC Exams 2025: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు..టైమ్, రూల్స్ ఇవే

Highlights

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు మరోసారి గడువును పెంచింది యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్ యూపీఎస్‌సీ.

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు మరోసారి గడువును పెంచింది యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్ యూపీఎస్‌సీ. అఖిల భారత సర్వీసు ఉద్యోగాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 979 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షల కోసం ఈ ఏడాది జనవరిలోలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11 వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. అయితే ఆ గడువును ఫిబ్రవరి 18 వరకు పొడిగించారు. ఆ తర్వాత ఈ గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈ ఏడాది మే 25న పరీక్ష నిర్వహించనున్నారు.

యూపీఎస్‌సీ పరీక్షకు దరఖాస్తు చేయడానికి కనీసం 21 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 32 ఏళ్లు దాటవద్దు. 2025 ఆగస్టు 1 వరకు అభ్యర్థుల వయస్సును లెక్కిస్తారు. రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పోస్టులకు దరఖాస్తుకు అప్లయ్ చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories