గాయనిపై అత్యాచారం కేసులో ఎమ్మెల్యేపై కేసు

గాయనిపై అత్యాచారం కేసులో ఎమ్మెల్యేపై కేసు
x
Highlights

ఓ గాయనిని సామూహిక అత్యాచారం చేశారనే ఆరోపణలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. యూపీకి చెందిన నిషాద్..

ఓ గాయనిని సామూహిక అత్యాచారం చేశారనే ఆరోపణలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. యూపీకి చెందిన నిషాద్ పార్టీ ఎమ్మెల్యే విజయ మిశ్రా, ఆయన కుమారుడు కలిసి.. 2014లో తనను ఓ కార్యక్రమం కోసం ఇంటికి పిలిచి, తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా తనపై ఎమ్మెల్యే మిశ్రా అత్యాచారం చేసిన అనంతరం బయట వదిలివేయాలని ఎమ్మెల్యే కొడుకు, మేనల్లుడికి చెప్పారని, అయితే వారిద్దరూ కూడా తనపై అత్యాచారం జరిపారని బాధితురాలు ఆరోపించారని.. అందువల్ల ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని భడోహి జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ చెప్పారు. ఇదిలావుంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎమ్మెల్యే విజయ్ మిశ్రా మధ్యప్రదేశ్ నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్టు అయి ఆగ్రా జైలులో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories