మెడలో కరెన్సీ మాలను లాక్కెళ్లిన ట్రక్ డ్రైవర్.. సినీ ఫక్కీలో రిస్క్ చేసిన వరుడు

మెడలో కరెన్సీ మాలను లాక్కెళ్లిన ట్రక్ డ్రైవర్.. సినీ ఫక్కీలో రిస్క్ చేసిన వరుడు
x
Highlights

యూపీలోని మీరట్‌లో ఓ పెళ్లి వేడుకలో ఊహించని ఘటన జరిగింది

యూపీలోని మీరట్‌లో ఓ పెళ్లి వేడుకలో ఊహించని ఘటన జరిగింది. కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు ఎంతో ఉత్సాహంగా గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయల్దేరారు. అతని మెడలో కరెన్సీ దండతో డబ్పు వాయిద్యాలు, డ్యాన్సులతో ఎంతో ఉత్సాహంగా బంధువులు అతన్ని తీసుకెళ్తున్నారు. ఇంతకీలో సినీ ఫక్కీలో ఘటన జరిగింది. అటుగా వెళ్తున్న ట్రక్ డ్రైవర్ వరుడి మెడలోని కరెన్సీ మాలను లాక్కెళ్లిపోయారు.



అయితే కొందరు పోతే పోయిందిలే అనుకుని మండపానికి వెళ్లిపోతారు. కానీ ఈ పెళ్లి కొడుకు అలా అనుకోలేదు. హీరో లెవల్లో ట్రక్ డ్రైవర్ వెంట పరిగెత్తాడు. గుర్రం నుంచి బైక్ ఎక్కిన పెళ్లి కొడుకు.. ట్రక్ ను వెంబడించాడు. సినిమా లెవల్లో ట్రక్ పైకి ఎక్కి క్యాబిన్లోకి దూరాడు. కరెన్సీ మాలను డ్రైవర్ నుంచి లాక్కున్నారు. వాహనాన్ని ఆపి డ్రైవర్ పై ఎటాక్ చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన వరుడి బంధువులు సైత ట్రక్ డ్రైవర్ ను చిలక్కొట్టారు. ఇదంతా చిన్న పాటి సినిమా సీన్‌ను తలపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories