Alok Prasad Pasi Arrested in UP: మహిళ ఆత్మహత్య కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్

Alok Prasad Pasi Arrested in UP: మహిళ ఆత్మహత్య కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్
x
Highlights

Alok Prasad Pasi Arrested in UP: ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేలా ఆమెను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ.. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ గవర్నర్ సుఖ్‌దేవ్ ప్రసాద్ కుమారుడు..

Alok Prasad Pasi Arrested in UP : ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేలా ఆమెను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ.. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ గవర్నర్ సుఖ్‌దేవ్ ప్రసాద్ కుమారుడు, అలోక్ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ మంగళవారం ఉదయం లక్నోలో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆ సమయంలో అలోక్ ప్రసాద్ ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి.

అయితే దాదాపు 90% కాలిన గాయాలకు గురై.. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆసుపత్రిలో చేరారు, అయితే దురదృష్టవశాత్తు ఆమె బుధవారం అర్థరాత్రి మరణించారు. దాంతో బుధవారం రాత్రి గోమతి నగర్ లోని అలోక్ ప్రసాద్ నివాసంలో అరెస్టు చేసి గురువారం మధ్యాహ్నం కోర్టుకు హాజరుపరిచిన తరువాత న్యాయ కస్టడీకి పంపినట్లు సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి), సోమెన్ బార్మా తెలిపారు.

అలోక్ ప్రసాద్ యుపి కాంగ్రెస్ షెడ్యూల్డ్ కుల మరియు షెడ్యూల్డ్ తెగ సెల్ చైర్‌పర్సన్ గా ఉన్నారు. అలోక్ ప్రసాద్‌ పై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 306/511 కింద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినట్లు డిసిపి తెలిపారు. అలాగే నేరపూరిత కుట్ర సెక్షన్ 120-బి కింద కూడా కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories