మళ్లీ వార్తల్లోకి స్వామి చిన్మయానంద్‌.. విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో బెయిల్

మళ్లీ వార్తల్లోకి స్వామి చిన్మయానంద్‌.. విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో బెయిల్
x
Highlights

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ బెయిల్‌ లభించింది.

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ బెయిల్‌ లభించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నవ్‌కు చెందిన స్వామి చిన్మయానంద్‌ షహజన్‌పూర్‌లోని లా కాలేజీలో డైరెక్టర్‌గా వ్యవహరించిన సమయంలో యువతిని లైంగిక దాడికి చేశారనే కేసులో 2019 సెప్టెంబర్‌లో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

చిన్మయానంద్‌ త‌న‌పై పలుమార్లు లైంగికంగా వేధించిన‌ట్లు ఇటీవ‌ల ఓ న్యాయ విద్యార్థిని ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఫిర్యాదు చేసినా చిన్మయానంద్‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం లేద‌ని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. చిన్మయానంద్ తాను హాస్టల్‌లో స్నానం చేస్తున్న వీడియోలు రికార్డు చేసి వాటిని నెట్లో పెడతానని బెదిరిస్తూ లైంగిక దాడికి చేశారని ఆ యువతి సంచలన ఆరోపణలు చేశారు. చిన్మయానంద్‌ యూపీకి చెందిన స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ చిన్మయానంద్‌ను విచారించింది. ఈ కేసులో చిన్మయానంద్‌పై సెక్షన్ 354 డీ, సెక్షన్ 342, సెక్షన్ 376 సీ, సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన తరువాత బీజేపీ పార్టీ నుంచి బహిష్కరింస్తు చర్యలు తీసుకుంది.

ఈ నేపథ్యంలో సిట్‌ అధికారి మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ చిన్మయానంద్‌ అంగీకరించాడని తెలిపారు. ఈ విధంగా చేసినందుకు తాను సిగ్గుపడుతున్నానని , అనేకసార్లు ఆమెను వేధించినట్టుగా ఒప్పకున్నారని అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు చిన్మయానంద్‌ను ఆరెస్టు చేశారు. కాగా.. మూడు నెలల తర్వాత ఆయన బెయిల్‌ లభించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories