ఉన్నావ్ తీర్పుపై ఉత్కంఠ

ఉన్నావ్ తీర్పుపై ఉత్కంఠ
x
Highlights

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ సెంగార్‌ పై తీర్పు ఎలా రానుందనే ఉత్కంఠ నెలకొంది. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో గతేడాది నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో వచ్చే తీర్పు కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది.

2017 లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఓ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమ్మాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, సహకరించిన శశిసింగ్ అనే వ్యక్తిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో బాధితురాలి తండ్రి దగ్గర ఆయుధాలున్నాయంటూ అతన్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణలోనే ఆయన ప్రాణాలు వదిలారు.

అంతేకాకుండా గత జులైలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు మరణించగా ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్‌ కూడా ప్రధాన నిందితుడే చేయించాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితురాలికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చింది. సుప్రీం ఆదేశాలతో ఆమె కుటుంబానికి సీఆర్పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించింది. ఇటు పరిస్థితిని సమీక్షించిన సుప్రీంకోర్టు కేసును లక్నో బెంచ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇటీవల దుండగులు బాధితులరాలిని సజీవంగా తగులబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో సీబీఐ వాదనలు పూర్తైన తర్వాత ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తీర్పు వెలువరిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories