ఇవాల్టినుంచి తెరుచుకోనున్న పాఠశాలలు.. ఏపీలో..

ఇవాల్టినుంచి తెరుచుకోనున్న పాఠశాలలు.. ఏపీలో..
x
Highlights

మూసివేయాలని నిర్ణయించాయి. ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపై నోటీసులు జారీ చేశాయి. పంజాబ్‌లో కూడా పాఠశాలలను తెరవడానికి సిద్ధమైనా మరో 15 రోజులు..

అన్ లాక్ -4 కింద ఇవాల్టినుంచి అనేక రాష్ట్రాల్లో 9 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలు పాక్షికంగా తెరుచుకోనున్నాయి. తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్ఓపి) ను విడుదల చేసింది. అయితే కేంద్రం అనుమతి ఇచ్చినా ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాలు ప్రస్తుతానికి పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించాయి. ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపై నోటీసులు జారీ చేశాయి. పంజాబ్‌లో కూడా పాఠశాలలను తెరవడానికి సిద్ధమైనా మరో 15 రోజులు ఆగాలని నిర్ణయించింది ప్రభుత్వం. మధ్యప్రదేశ్, హర్యానా, నాగాలాండ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. మరోవైపు వివిధ రాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. దీంతో తమ పిల్లలను బడులకు పంపించడానికి తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.

ఇదిలావుంటే ఇవాల్టినుంచి విద్యాసంస్థల తోపాటు దేశంలో క్రీడలు, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, మత, విద్యా, వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ కార్యక్రమాలలో 100 మందికి పైగా హాజరు కాకూడదనే నిబంధన ఉంది.. ఇటువంటి కార్యక్రమాలలో 100 మందికి పైగా వ్యక్తులు కనబడితే.. మార్గదర్శకాల ఉల్లంఘన అవుతుంది.. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమాలలో సామాజిక నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories