రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో..

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో..
x
Highlights

ప్రజల సౌలభ్యం కోసం త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది..

ప్రజల సౌలభ్యం కోసం త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. అన్‌లాక్ -4 మార్గదర్శకాలను విడుదల చేసిన మూడు రోజుల తరువాత, ప్రత్యేక రైళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు భారత రైల్వే తెలిపింది. ఇంకా ఎన్ని రైళ్లను నడపాలో ఆయా రాష్ట్రాల డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో మరో 100 రైళ్లను నడిపే ప్రణాళికపై రైల్వే కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుండి అన్ని ప్యాసెంజర్, మెయిల్ , ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను రైల్వే రద్దు చేసింది. అయితే మే 1 నుంచి కార్మికుల కోసం రైల్వే ష్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపింది.

వీటి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులను వారి ఇళ్లకు చేరుకున్నారు. ఇందుకోసం 85 శాతం ఖర్చును కేంద్రం భరించిందని రైల్వే శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రాలు 15% ఖర్చును భరించాయని పేర్కొంది. ఇదిలావుంటే గత వారంలోనే, సెప్టెంబర్ 7 నుండి మెట్రో సేవను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేయనుంది. దీంతో నగర ప్రయాణికులకు కాస్త ఊరట కలగనుంది. గత ఆరు నెలలుగా మెట్రో సేవలు నిలిచిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories