Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

Union Minister Nitin Gadkari falls ill on Stage in Siliguri
x

Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత 

Highlights

Nitin Gadkari: బెంగాల్‌లోని సిలిగిరిలో 4 లైన్ల రహదారి ప్రారంభ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ.. వేదికపై ఉండగానే అస్వస్థతకు గురైన గడ్కరీ

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. స్టేజీపై ఉండగానే అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వైద్యుడిని గ్రీన్ కారిడార్‌ ఏర్పాటు చేసి మరీ.. సభావేదికపై రప్పించి.. చికిత్స అందించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయాయని ప్రాథమిక పరీక్షలో గుర్తించారు. తర్వాత సెలైన్ ఎక్కించి.. డార్జిలింగ్‌కు తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స జరుగుతోందని.. అధికారులు వెల్లడించారు. సిలిగురిలోని సేవక్ కంటోన్మెంట్ పరిధిలో.. నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన నితిన్ గడ్కరీ.. వేదికపై ఉన్న సమయంలోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories