కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన
x
union minister Nirmala Sitharaman(File photo)
Highlights

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. కొన్ని పథకాలకే నిధులు కేటాయించాలని నిర్ణయించునట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. కొన్ని పథకాలకే నిధులు కేటాయించాలని నిర్ణయించునట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. ఈ నేపద్యంలో గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్, ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీలకు మాత్రమే నిధులు కేటాయిస్తామని చెప్పారు.

ఒక ఏడాది పాటు కొత్తగా ఎలాంటి పథకాలను ప్రారంభించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొత్త పథకాల నిధుల కోసం అభ్యర్థనలు పంపవద్దని అన్ని శాఖలకు తెలియజేశామని చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామన్నారు.

కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని... అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మల సీతారామన్ చెప్పారు. ఒక వేళ తాజా నిబంధలనకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే... డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ (ఖర్చుల శాఖ) అనుమతి తీసుకోవాలని అన్నారు. మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈరోజు భారీగా పెరిగింది. 24 గంటల్లో 9,851 కేసులు నమోదయ్యాయి. 0273 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కేసుల సంఖ్య 2,26,770కి చేరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories