మూడు రాజధానులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
x
kishan Reddy File Photo
Highlights

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు నష్టపోతున్నారని కిషన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళనకారులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందని, కేంద్ర జోక్యం చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూడు రాజధానుల విషయంతో కేంద్ర ప్రభుత్వానికి జగన్ సర్కార్ నుంచి ఏటువంటి సమాచారం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా సమాచారం అందితే ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. రాజ్యాంగం పరిధిలోనే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. రైతుల గురించి ఆలోచించాలని ఏపీ ప్రభుత్వానికి చెబుతామని తెలిపారు. రాజధాని మార్పు మంచిది కాదని.. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విషయమని.. అయితే ప్రభుత్వానికి సూచనలు చెస్తామని తెలిపారు. మూడు రాజధానులకు బీజేపీ వద్దని చెప్పిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories