logo
జాతీయం

వ్యవసాయ చట్టాల పట్ల రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తున్నాం : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

వ్యవసాయ చట్టాల పట్ల రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తున్నాం : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి
X
Highlights

వ్యవసాయ చట్టాల పట్ల రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తున్నాం అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. రైతుల ఆందోళనపై గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చిట్టా శుద్ధితో ఉందని ఆయన చెప్పారు.

వ్యవసాయ చట్టాల పట్ల రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తున్నాం అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. రైతుల ఆందోళనపై గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చిట్టా శుద్ధితో ఉందని ఆయన చెప్పారు. వ్యవసాయ చట్టాల వాళ్ళ రైతులకు మేలు జరుగుతుందని మంత్రి ఉద్ఘాటించారు. అంతే కాకుండా కాంటాక్ట్ వ్యవసాయంతో రైతుల భూమికి రక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏమన్నారంటే..

* కొత్త చట్టాలతో రైతులు కొత్త సాంకేతికతతో జోడించబడతారు.. రైతులకు రక్షణ కల్పించే అంశాలను చట్టంలో పొందుపరిచాం

* కాంట్రాక్టు వ్యవసాయం లో రైతుల భూమికి రక్షణ ఉంటుంది

* వ్యవసాయ చట్టాల వల్ల చాలా మంది రైతులు లబ్ది పొందుతున్నారు. కానీ పంజాబ్ సహా కొన్ని రైతు సంఘాలు వ్యవసయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు

* వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నవారితో చర్చలు జరిపాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ 8 వరకు ఆరుసార్లు చర్చలు జరిపాం

* రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం తన ప్రతిపాదనలు పంపాము..కానీ చట్టాలను మొత్తం రద్దు చేయమంటున్నారు

* రైతు సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది ..కేంద్రం ప్రతిష్టలకు పోవడం లేదు

* మద్దతు ధర,మార్కెట్ వ్యవస్థ యధావిధిగా కొనసాగుతుంది..ఏ విషయాల్లో కేంద్రం చట్టాలు చేయవచ్చో అది కూడా లేఖ ద్వారా రైతులకు తెలిపాం

* మార్కెట్ వ్యవస్థలలో ఉన్న అపోహలు తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేసాం. పాన్ కార్డు ఉన్న ప్రైవేట్ వ్యక్తులుపంటలు కొనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వాలు నియమ నిబంధనలు పెట్టొచ్చు

* కాంట్రాక్టు ఒప్పదంలో సమస్యలు కోర్టు పరిధిలోకి వస్తే సమస్యల పరిష్కారం చాలా సమయం పడుతుందన్న కోణంలో ఎస్డీఎం పరిధిలో త్వరగా సమస్య పరిష్కరించుకోవచ్చని చట్టంలో పొందు పరిచాం

* గుజరాత్, మహారాష్ట్ర,కర్ణాటక,పంజాబ్,హర్యానాలో కాంట్రాక్టు వ్యవసాయం జరుగుతుంది..ఇప్పటి వరకు ఇబ్బందులు లేవు. కాంట్రాక్టు వ్యవసాయంలో రైతు భూమిపై కాంట్రాక్టు దారు లోన్ తీసుకునే అవకాశం లేకుండా చేస్తామని చెప్పాము

* పంటలకు మద్దతు ధర కొనసాగుతుంది..ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మద్దతు ధర విషయంలో కేంద్రం కట్టుబడి ఉంది..లిఖిత పూర్వక హామీ ఇస్తామని తెలిపాం

* విద్యుత్ బిల్లులు నష్టం కలిగిస్తాయన్న అంశం పై కూడా రైతులకు స్పష్టత ఇచ్చాం. రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం వైఖరిని లిఖిత పూర్వకంగా రైతులకు అందజేసాం.

కేంద్రం ప్రతిపాదనలపై రైతు సంఘాలు పునరాలోచించుకోవాలి

* రైతులు ఎప్పుడు వచ్చినా కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉంది. యుపిఏ హయాం కంటే 6 రెట్లు ప్రజలకు మోడీ హయాంలో మంచి జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తో పదిన్నర కోట్ల మందికి లబ్ది చేకూరుతుంది. రైతులు పెన్షన్ లబ్ది పొందుతున్నారు . చిన్న రైతుల అభివృద్ధి కోసం కొత్త చట్టాలు తెచ్చాం

* లాక్ డౌన్ లో ప్రపంచవ్యాప్తంగా అన్ని బంద్ అయ్యాయి..కానీ మోడీ నిర్ణయాల వల్ల గ్రామీణ భారతంలో పంటలు కోయడం,అమ్ముకోవడం ఏది ఆగలేదు.

* రైతు సంక్షేమం కోసం లక్ష కోట్ల ప్యాకేజీకి కేంద్రం సిద్దమైంది. గ్రామాలను,వ్యవసాయ రంగాన్ని ఆత్మనిర్బర్ చేసినప్పుడే దేశం ఆత్మనిర్బర్ భారత్ అవుతుంది

* వ్యవసాయ చట్టాల పట్ల రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తున్నాం. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది..రైతు సంఘాలు చర్చలకు ముందుకు రావాలి.

Web Titleunion minister for agriculture Narendra singh Thomar says that government trying to help farmers in many ways
Next Story