లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం స్పందన

లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం స్పందన
x
Highlights

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ పోతుండటంతో మళ్ళీ మొదటి తరహా లాక్ డౌన్ పునరుద్ధరిస్తారంటూ గత కొద్ది రోజులుగా వివిధ సామాజికమాధ్యమాల్లో...

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ పోతుండటంతో మళ్ళీ మొదటి తరహా లాక్ డౌన్ పునరుద్ధరిస్తారంటూ గత కొద్ది రోజులుగా వివిధ సామాజికమాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని.. లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రూమర్ల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచింది.

కాగా జూన్ 15 లేదా 17వ తారీకు నుంచి దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వివరణ ఇవ్వకపోవడంతో జనాలు అయోమయానికి లోనయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చినట్టయింది. కాగా కరోనా కట్టడికి ప్రధాని మోదీ మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జూన్‌ 8 నుంచి లాక్‌డౌన్‌ను దశలవారిగా భారీగా సడలింపులు ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories