కరోనా వైరస్ నివారణకు కేంద్రం కొత్త మార్గ దర్శకాలు

కరోనా వైరస్ నివారణకు కేంద్రం కొత్త మార్గ దర్శకాలు
x
Highlights

రోజురోజుకూ కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుండటం, తీవ్రస్థాయిలో రోగులు ఆస్పత్రులకు వస్తుండటంతో కేంద్రం కొత్త మార్గ దర్శకాలను రూపొందించింది.

రోజురోజుకూ కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుండటం, తీవ్రస్థాయిలో రోగులు ఆస్పత్రులకు వస్తుండటంతో కేంద్రం కొత్త మార్గ దర్శకాలను రూపొందించింది. అయితే ఇంతవరకు కరోనా అదుపులోనే ఉందని, భవిషత్తులో తీవ్రమైతే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీనిపై కేంద్రం విధించిన నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సి ఉందని అభిప్రాయపడింది.

భారత్‌లో కరోనా వైరస్ అదుపులోనే ఉందని, విజృంభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో) అభిప్రాయపడింది. అయితే, ముప్పు తొలగిపోలేదని, లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపుల నేపథ్యంలో ఏ సమయంలోనైనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చవచ్చని హెచ్చరించింది. కేసుల సంఖ్య రెట్టింపు సమయం, సామూహిక వ్యాప్తిపై దృష్టి సారించి కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగకుండా కట్టడి చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆస్పత్రులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో కరోనా అసలు రూపం ఇప్పుడే బయటపడుతుందని వైద్యాధికారులు చెబుతున్న క్రమంలో దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. కరోనా లక్షణాలు లేని, తేలికపాటి లక్షణలు ఉన్న కేసులకు ఆస్పత్రి అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. తేలికపాటి లక్షణాలు లేదా లక్షణాలు లేని రోగిని ఆస్పత్రిలో చేరిన 24 గంటలలోపు డిశ్చార్జ్ చేయాలని పేర్కొంది. లక్షణాలు లేని వారు హోం క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అన్ని ఆస్పత్రులు కేంద్రం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories