20 నుంచి పల్లెల్లో ఉపాధి హామీ పనులు.. వీటికే అధిక ప్రాధాన్యత..

20 నుంచి పల్లెల్లో ఉపాధి హామీ పనులు.. వీటికే అధిక ప్రాధాన్యత..
x
Highlights

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టం (MGNREGA) కింద పనులను ఏప్రిల్ 20 నుంచి అనుమతించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలిపింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టం (MGNREGA) కింద పనులను ఏప్రిల్ 20 నుంచి అనుమతించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త లాక్‌డౌన్ మార్గదర్శకాలలో భాగంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్ద్యేశించి ప్రసంగించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మార్చి 25 నుండి భారతదేశం లాక్డౌన్లో ఉంది. అయితే ఇది మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని, ప్రతి ప్రాంతాలలో పరిస్థితిని అంచనా వేసిన తరువాత ఏప్రిల్ 20 నుండి రైతులు, రోజువారీ కూలీలు మరియు ఇతరులకు కొన్ని సడలింపులు ఇస్తామని పిఎం మోడీ తన మంగళవారం ప్రసంగంలో చెప్పారు..

అన్నట్టుగానే ఈ రోజు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 20 నుండి MGNREGA పనులు అనుమతించబడతాయి, అయితే ఈ పనులు చేసేటప్పుడు ప్రజలు తమ ముఖాలకు మాస్కులు ధరించడమే కాకుండా సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు.

అయితే ముఖ్యంగా నీటిపారుదల , నీటి సంరక్షణకు సంబంధించిన వర్క్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని MGNREGA కింద మార్గదర్శకాలు చెబుతున్నాయి. కాగా భారతదేశంలో కరోనావైరస్ వల్ల కలిగే కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించిన వారి సంఖ్య బుధవారం ఉదయం 11,439 కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 1,306 మంది కోలుకోగా 377 మంది మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories