అమ్మాయిల వివాహ వయస్సు పెంపు దిశగా కేంద్రం ఆలోచన!

అమ్మాయిల వివాహ వయస్సు పెంపు దిశగా కేంద్రం ఆలోచన!
x
Highlights

మహిళల పెళ్లి వయస్సు తక్కువగా ఉండటం వల్ల లేనిపోని ఇబ్బందులొస్తున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

మహిళల పెళ్లి వయస్సు తక్కువగా ఉండటం వల్ల లేనిపోని ఇబ్బందులొస్తున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పురుషులతో అన్నింటా సమానంగా తన జీవన విధానాన్ని మార్చుకున్న మహిళలకు ఏ వయస్సులో పెళ్లి చేసుకుంటే అన్ని విధాలా కలిసొస్తుందనే విషయాన్ని ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అయితే వచ్చే నెలాఖరులో ఈ కమిటీకి సంబంధించిన నివేదిక కేంద్రానికి అందించనుంది. కమిటీ అందించిన సూచనల మేరకు కేంద్రం అడుగులు వెయ్యిబోతోంది.

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మహిళల కనీస వివాహ వయస్సు పెంపుపై దృష్టి సారించింది. అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి కావడం వల్లే ఎక్కువగా శిశు మరణాలు, మాతృ మరణాలు జరుగుతున్నాయని కేంద్రం భావిస్తోంది. అందుకే వారు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారన్న దానిపై అధ్యయనం చేసేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో అనేక రాష్ట్రాలు మాతృ మరణాలపై పురోగతి సాధించినా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు.

ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. కాగా ఈ వయసును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని చూస్తోంది. శిశు మరణాలు, మాతృ మరణాలు, సంతాన సాఫల్య రేట్‌, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాలను సమగ్ర పరిశీలన చేసి జూలై 31 నాటికి టాస్క్‌ఫోర్స్‌ కేంద్రానికి నివేదిక అందజేయనుంది. కాగా, బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రకటనకు అనుగుణంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు అయింది. జయా జైట్లీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో నజ్మా అఖ్తర్‌, వసుధా కామత్‌, దీప్తి షా, వినోద్‌ పాల్‌తో పాటు కేంద్ర వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, న్యాయశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories