గుడ్ న్యూస్.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు త్వరలోనే స్వదేశానికి

గుడ్ న్యూస్.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు త్వరలోనే స్వదేశానికి
x
Representational Image
Highlights

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 7 నుంచి దశల వారీగా భారతీయులను తరలింపు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ప్రత్యేక విమానాలు, నౌకల ద్వారా వారిని స్వదేశానికి చేరవేస్తామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (sop)ని కేంద్రం సిద్ధం చేసింది. అలాగే దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీలు, హై కమిషనన్స్ భారతీయుల వివరాలను సేకరిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది.

ప్రత్యేక విమాన, నౌక సర్వీసులను ఉపయోగింకోదలచుకున్న భారతీయులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులందరినీ విమానాలను ఎక్కించేముందు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహింస్తారు. ప్రయాణ సమయంలో భారతీయులు కేంద్ర ఆరోగ్యశాఖ జారీచేసిన హెల్త్‌ ప్రొటోకాల్‌ను పాటించాల్సి వుంటుంది. ఇక్కడ విమాాశ్రయానికి రాగానే మరోసారి స్క్రీనింగ్ చేస్తారు. కేంద్ర మార్గదర్శకాలు ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత కరోనా టెస్టుల్లో నెగెటివ్ వస్తేనే ఇంటికి పంపిస్తారు.

ఎయిర్‌పోర్టు నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మనదేశంలో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పౌరవిమానయానశాఖ త్వరలోనే పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories