కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. విమాన సర్వీసులన్నీ బంద్..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. విమాన సర్వీసులన్నీ బంద్..
x
Representational Image
Highlights

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతుంది. దేశంలో లాక్ డౌన్ నిబంధ‌లు క‌ఠినంగా అమ‌లవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతుంది. దేశంలో లాక్ డౌన్ నిబంధ‌లు క‌ఠినంగా అమ‌లవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌ ప్ర‌భుత్వం లాక్ డౌన్ మ‌రింత పొడిగించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏప్రిల్‌ 14నాటికి లాక్‌డౌన్‌ ముగియాల్సి ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ పొడగించే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేశంలో నెల‌కొన్న తాజా పరిస్థితిపై ప్రధానమంత్రి అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కాగా.. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా విమాన స‌ర్వీసులు ముగ‌బోనున్నాయి. ఇండియాలో క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన త‌ర్వాత విమాన స‌ర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయ‌ని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి వెల్లడించారు. దేశంలో పూర్తిగా ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని హ‌ర్దీప్ పూరి స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహకరిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్‌ 30వరకు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories