సుప్రీంకోర్టులో వలస కార్మికుల కేసు : కేంద్రం అఫిడవిట్

సుప్రీంకోర్టులో వలస కార్మికుల కేసు : కేంద్రం అఫిడవిట్
x
Highlights

వలస కూలీల కేసులో కేంద్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

వలస కూలీల కేసులో కేంద్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో, కార్మికులను వారి ఇళ్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక లేబర్ రైళ్లు నడిపినట్లు ప్రభుత్వం తెలిపింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బస్సులను నడిపాయని. కూలీలకు ఉచిత ఆహారం, నీరు, మందులు, బట్టలు, చెప్పులు, ఇతర అవసరమైన వస్తువులను అందించినట్టు పేర్కొంది. రహదారిపై నడుస్తున్న కార్మికులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సహాయంతో వారి ఇంటికి తీసుకెళ్లారని..

వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రైల్వేలు ఉచిత ఆహారం మరియు నీటిని అందిస్తాయని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సౌకర్యాలను మినహాయించి. జూన్ 1 నాటికి, రైల్వే 1.63 కోట్ల ఆహార ప్యాకెట్లను.. 2.10 కోట్లకు పైగా నీటి బాటిళ్లను పంపిణీ చేసినట్టు తెలిపింది. అంతకుముందు జూన్ 5 న వలస కూలీల సమస్యపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా రాబోయే 15 రోజుల్లో కార్మికులను తమ ఇళ్లకు తీసుకెళ్లాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే వలస కూలీలందరికీ ఉపాధి ఏర్పాట్లు ఉండేలా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కేంద్రం మరియు రాష్ట్రాల అన్ని అభ్యర్ధనలను విన్న తరువాత కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వు చేసింది. జూన్ 9న ఈ విషయంలో కోర్టునుంచి నిర్ణయం రావాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories