కేంద్ర హోమ్ శాఖనుంచి ఉపశమనం కలిగించే వార్త

కేంద్ర హోమ్ శాఖనుంచి ఉపశమనం కలిగించే వార్త
x
Representational Image
Highlights

ప్రజలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) పెద్ద ఉపశమనం కలిగించే వార్త అందించింది.

ప్రజలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) పెద్ద ఉపశమనం కలిగించే వార్త అందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని.. శుక్రవారం రాత్రి విడుదల చేసిన తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కానీ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే అనుమతి ఇచ్చింది. షాపులు తెరవడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి ఉండాలి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి... ఈ రూల్ ఇక్కడ వర్తించదు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే మాత్రం తెరవచ్చు.

హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం, ఈ రోజు నుండి తిరిగి తెరవడానికి అనుమతించబడిన దుకాణాలలో మునిసిపల్ ప్రాంతాలలోని నివాస సముదాయాలలో ఉన్నాయి, కానీ అవసరమైన జాగ్రత్తలు తీసుకున్న తరువాతనే అనుమతిస్తారు. ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ ఉంది.. కానీ తాజాగా అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని సూచించింది. అయితే ప్రజలు ఈ షాపులకు వెళితే.. కచ్చితంగా భౌతిక దూరంపాటిస్తూ, మాస్క్ వాడటం తోపాటు, శానిటేజర్లు వాడాలి. ఇక కేంద్రం ఇచ్చిన జాబితాలో ఇలా పేర్కొన్నారు..

స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు.

♦ హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి అనుమతి లేదు.

♦ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు.

♦ షాపులలో ఇదివరకు మళ్లే అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండకూడదు. సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories