Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. పార్లమెంట్ సమావేశాల తేదీలు ఇవే

Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. పార్లమెంట్ సమావేశాల తేదీలు ఇవే
x
Highlights

Budget 2025: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...

Budget 2025: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను కేంద్రం ఖరారు చేసింది. జనవరి 31వ తేదీ మొదలు కానున్నాయి పార్లమెంట్ సమావేశాలు. ఈసారి కూడా రెండు విడతల్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను తెలుసుకుందాం.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఆర్థిక ఏడాది 2025-26కి సంబంధించిన పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లు ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. జనవరి 31వ తేదీన మొదలై ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత మళ్లీ దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత రెండో విడత సమావేశాలు మొదలు కానున్నాయి. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.

జనవరి 31న పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు షురూ కానున్నాయి. అదే రోజు ఆర్ధిక సర్వే ను పార్లమెంట్ ముందుకు తీసుకువస్తుంది కేంద్రం. ఆ తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ప్రధానమంత్రి నేత్రుత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బడ్జెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.

ఇక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. వరుసగా 8వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా నిలుస్తారు. దీంతో రెండు మధ్యంతర బడ్జెట్లు, 6 పూర్తి స్థాయి బడ్జెట్లను నిర్మలా సీతారామాన్ ప్రవేశపెట్టినవారవుతారు. ఆమె కంటే ముందు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ 10సార్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories