కొత్త అవతారం ఎత్తనున్న శశిథరూర్

Shashi Tharoor,
x
Shashi Tharoor,
Highlights

ప్రముఖ రచయిత కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కమెడియన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రముఖ రచయిత కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కమెడియన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే వన్ మైక్ స్టాండ్ అనే కామెడీ షోలో ఆయన నటించనున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రచార వీడియోను శశిథరూర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ మీడియోను చూసిన అభిమానులు శశిథరూర్ నటనను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ షో శుక్రవారం ప్రసారం కానుంది. ఈ షోలో మొత్తం 5మంది సెలిబ్రెటీలు ఉన్నారు. మరో ఐదుగురు కమెడియన్స్ తో పోటీపడనున్నారు. ఈ షోలో తాను నటిస్తున్నట్లు శశిథరూర్ తన ట్వీటర్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ.. నా చిన్నతనం సాధారణంగా గడిచింది. మా ఇంటికి వచ్చే బంధువుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవారు అని మాట్లాడడం ఈ వీడియోలో ఉంది. ఈ షోలో శశిథరూర్ తోపాటు హీరోయిన్ తాప్సీ, రిచా చద్దా, కమెడియన్స్ రోహన్ జోషి, సపన్ వర్మ, వంటి వారు ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories