
ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అంతేకాదు కొద్దిరోజులపాటు విద్యా సంవత్సరం వెనకబడింది.
ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అంతేకాదు కొద్దిరోజులపాటు విద్యా సంవత్సరం వెనకబడింది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో ఆగస్టులో కళాశాలలు ప్రారంభమవుతాయని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (UGC) పేర్కొంది..
అంతేకాదు నూతన విద్యార్ధుల ప్రవేశాలను సెప్టెంబర్ నుంచి చేపట్టాలని పేర్కొంది. ఇక దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది UGC. 2020 ఏప్రిల్ 29 న UGC నిపుణుల ప్యానెల్ కమిటీ ఇతర సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి సమక్షంలో పరీక్షలు , అకాడెమిక్ క్యాలెండర్ కు సంబంధించిన సిఫారసులను విడుదల చేసింది.
1. ఇంటర్మీడియట్ సెమిస్టర్ విద్యార్థులు: ప్రస్తుత , మునుపటి సెమిస్టర్ యొక్క అంతర్గత అంచనా ఆధారంగా గ్రేడ్ ఉండనుంది. అదేక్రమంలో జూలై నెలలో కోవిడ్ -19 పరిస్థితి సాధారణస్థితికి వచ్చిన రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించబడతాయి.
2. టెర్మినల్ సెమిస్టర్ విద్యార్థులు : పరీక్షలు జూలై నెలలో ప్రారంభం అవుతాయి.
3. ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక కోవిడ్ -19 సెల్ ఏర్పాటు.
4. అలాగే యుజిసిలో కూడా కోవిడ్ -19 సెల్ ఏర్పాటు.
5. ఒకవేళ అవసరమైతే విశ్వవిద్యాలయాలు జూన్ 01 నుండి 30 రోజుల వరకూ వేసవి సెలవులను పొడిగించుకోవచ్చు.
యుజిసి మార్గదర్శకాలు : విశ్వవిద్యాలయ పరీక్షలు..
తక్కువ వ్యవధిలో పరీక్షలు పూర్తి చేయడానికి విశ్వవిద్యాలయాలు ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపగోంచుకోవాలి.
విశ్వవిద్యాలయాలు పరీక్షల సమయాన్ని 3 గంటల నుండి 2 గంటలకు తగ్గించుకోవచ్చు.
కోవిడ్ -19 దృష్ట్యా పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే, "సామాజిక దూరం", అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటూ.. విద్యార్థులకు గ్రేడింగ్ నమూనాలో.. గత సెమిస్టర్ పెర్ఫామెన్స్ ఆధారంగా 50% మార్కులు, విశ్వవిద్యాలయాలచే ఇంటర్నల్ ఎవాల్యూయేషన్ ద్వారా మిగిలిన 50% మార్కులు ఇవ్వాలి.
విశ్వవిద్యాలయాలు స్కైప్ లేదా ఇతర టెక్నాలజీల ద్వారా ప్రాక్టికల్ పరీక్షలు , వివా-వోస్ పరీక్షలను నిర్వహించుకోవచ్చు, ఇంటర్మీడియట్ సెమిస్టర్ల విషయంలో మాత్రం, తరువాతి సెమిస్టర్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలి.
అలాగే విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ, ఎం. ఫిల్‌లను కూడా నిర్వహించవచ్చు. అయితే గూగుల్, స్కైప్, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ తో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివా-వోస్ పరీక్షలు నిర్వహించుకోవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



