UGC NET 2020 exam postponed: యూజీసీ నెట్ మ‌ళ్లీ వాయిదా

UGC NET 2020 exam postponed: యూజీసీ నెట్ మ‌ళ్లీ వాయిదా
x

యూజీసీ నెట్ 

Highlights

UGC NET 2020 exam postponed: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టీఏ) నిర్వ‌హించే యూజీసీ నెట్ అర్హత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈనెల 16 నుంచి జరగాల్సి యూజీసీ నెట్-2020 అర్హత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది

UGC NET exam postponed: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టీఏ) నిర్వ‌హించే యూజీసీ నెట్ అర్హత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈనెల 16 నుంచి జరగాల్సి యూజీసీ నెట్-2020 అర్హత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. ఈ ప‌రీక్ష‌ల‌ను ఈనెల 24 నుంచి నిర్వహిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది. త‌ర్వ‌లోనే హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ల‌లో విడుద‌ల చేస్తామంది.

వాస్తవానికి మే, జూన్‌ నెలల్లో జరగాల్సిన యూజీసీ నెట్-2020 పరీక్షలు కరోనా కారణంగా సెప్టెంబర్ కు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అన్ లాక్ కొనసాగుతుండటం, వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నెట్ పరీక్షలు కూడా సాఫీగా సాగుతాయని అంతా భావించారు. కానీ ఈనెల 16 నుంచి 24 మధ్యలోనే ''ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) పరీక్షలు ఉండటంతో తేదీలు క్లాష్ కాకూడదన్న ఉద్దేశంతోనే యూజీసీ నెట్-2020 పరీక్షలను వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ వివరించింది.

''ఐసీఏఆర్ పరీక్షలు ఈనెల 16, 17, 22, 23 తేదీల్లో జరగనున్నాయి. కాబట్టి అనివార్యంగా, పరీక్షల తేదీలు క్లాష్ కాకూడదనే యూజీసీ నెట్-2020ను మరోసారి వాయిదా వేశాం. సెప్టెంబర్ 24 నుంచి నెట్ పరీక్షలు నిర్వహిస్తాం. ఆయా సబ్టెక్టుల వారీగా సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తాం. '' అని ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ సాధనా పరాశర్ మీడియాతో అన్నారు.




.

Show Full Article
Print Article
Next Story
More Stories