విద్యాసంస్థలు జులైకి బదులు ఆ నెలలో ప్రారంభించాలి

విద్యాసంస్థలు జులైకి బదులు ఆ నెలలో ప్రారంభించాలి
x
Highlights

దేశంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చిన నేపథ్యంలో విద్యాసంస్థల్లో తరగతులను జులైలో కాకుండా సెప్టెంబరు నెలలో ప్రారంభించాలని యూజీసీ నియమించిన కమిటీ సిఫార్సు చేసింది.

దేశంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చిన నేపథ్యంలో విద్యాసంస్థల్లో తరగతులను జులైలో కాకుండా సెప్టెంబరు నెలలో ప్రారంభించాలని యూజీసీ నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున తరగతుల నష్టాలు, ఆన్‌లైన్‌ విద్య అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా కోరుతూ యూజీసీ 2 కమిటీలను నియమించింది.

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌, పరీక్షల నిర్వహణ పలు అంశాలపై హర్యానా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆర్‌సీ కుహాడ్‌ నేతృత్వంలోని ఓ కమిటీ అధ్యాయనం చేసింది.

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ పై ఇందిరాగాంధీ నేషనల్ యూనవర్సిటీ ఉప కులపతి సి.నాగేశ్వరరావు నేతృత్వంలోని కమిటీ అంశాన్ని పరిశీలించింది. ఈ రెండు కమిటీలు శుక్రవారం నివేదికలు సమర్పించాయి. విశ్వవిద్యాలయాల్లో క్లాసులు సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించాలని మొదటికమిటీ సిఫార్సు చేసింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ అన్ని మౌలిక సదుపాయాలు అమలులో ఉన్నట్లైతే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించొచ్చని లేకుంటే తెలిపింది.

ఇక లాక్ డౌన్ ముగిశాక పెన్ను-పేపర్ విధానంలో నిర్వహించాలని రెండో కమిటీ సూచించింది అని యూజీసీవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ రెండు నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నారని, ఈ విషయమై వచ్చే వారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎప్పటకప్పుడు కరోనా పరీక్షలు గమనిస్తున్నమాని, నీట్‌ జేఈఈ పరీక్షలను జూన్‌లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories