శరద్‌పవార్‌‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

శరద్‌పవార్‌‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే
x
Highlights

హావికాస్ ఘడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శరద్ పవార్ కీలక పాత్ర పోషించరని పేర్కొన్నారు.

మాజీ సీఎం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మహావికాస్ ఘడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శరద్ పవార్ కీలక పాత్ర పోషించరని పేర్కొన్నారు. ముంబైలోని వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఎదుర్కొనాలంటే, తక్కువ సీట్లు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శరద్‌పవార్‌ సూచించారు. మహావికాస్ ఘడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శరద్ పవార్ వ్యూహం రచించారని, వ్యవసాయ ఉత్పాదకత ఎలా పెంచోచ్చో నేర్పిన పవార్ తక్కవ సీట్లు ఉన్న పార్టీలు ప్రభుత్వాన్ని ఏలా ఏర్పాటు చేయాలో చూపించారని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుంది. అయితే అజిత్ పవార్ తో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించింది. సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నావీస్ అసెంబ్లీలో బలపరీక్షలో ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలంలో లేకపోవడంతో రాజీనామా చేశారు. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు కలిసి కూటమిగా ఏర్పాడ్డాయి. 169 మంది సభ్యుల బలంతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.కాంగ్రెస్ శివసేన రెండు వేర్వేరు సిద్దాంతాలు, అయినప్పటీకీ కాంగ్రెస్, శివసేన మద్య శరద్ పవార్ సయోద్య కుదర్చడంతో సఫలమైయ్యారు. అయితే బీజేపేీ మాత్రం శివసేనపై విమర్శలకు చేస్తుంది. ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసి సాధించిన సీట్లతోనే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఎద్దేవ చేస్తుంది. సీఎం పీఠం అధిష్టించిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చేవిధంగా ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ఇటీవలే శివసేన ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తున్నాట్లు కీలక నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories