సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌కు లైన్‌క్లియర్‌

Uddhav Thackeray resigns as Maharashtra CM
x

సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌కు లైన్‌క్లియర్‌ 

Highlights

*ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్న బీజేపీ, షిండే వర్గం

Maharashtra Political Crisis: పది రోజులుగా రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరుకుంది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే వర్గీయులు తిరుగుబాటు చేసుకున్న ఉత్కంఠ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ సర్కార్ కుప్పకూలింది. ఇవాళ బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నిమిషాల వ్యవధిలోనే సీఎం ఉద్దవ్ ధాక్రే రాజీనామా చేశారు. బుధవారం అర్ధరాత్రి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించారు. ధాక్రే రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే తీసుకున్న రాజీనామా నిర్ణయంతో మహారాష్ర్ట అసెంబ్లీలో బల పరీక్ష అవసరం లేకుండా పోయింది.

సంకీర్ణ సారథి శివసేనపై మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో జూన్ 21న మహారాష్ర్టలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి జూన్ 20న అర్ధరాత్రి షిండే రాష్ర్టం వీడి సూరత్ చేరుకున్నారు. ఆ తర్వాత గౌహతికి మకాం మార్చారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేలకు గాను 39 మందికి పైగా షిండే శిబిరంలో చేరారు. దీంతో ఉద్దవ్ థాక్రే సర్కార్ మైనార్టీలో పడింది. ఉద్దవ్ బెదిరింపులు, బుజ్జగింపులు, ఇరువర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. మాజీ సీఎం ఫడ్నవీసుకు గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలిసి బలనిరూపణ చేసుకోవాలంటూ కోరారు. ఆ వెంటనే సీఎం ఉద్దవ్ థాక్రేను గురువారం సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటూ గవర్నర్ ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ఆదేశంపై స్టే కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. బలనిరూపణే సమస్యకు పరిష్కారమంటూ కోర్టు అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల్లోనే సీఎం పదవి నుంచి ఉద్దవ్ థాక్రే తప్పుకున్నారు. ముఖ్యమంత్రి పదవితో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ థాక్రే చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆరోపించారు. రెండున్నరేళ్లు శివసేనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉద్దవ్ థాక్రే ధన్యవాదాలు తెలిపారు. తన హాయంలో తీసూకున్న నిర్ణయాలను ప్రస్తావించిన థాక్రే కొద్దిసేపటికే శివసేన ఎమ్మెల్యేలు, కొడుకు ఆధిత్య థాక్రేతో కలిసి రాజ్ భవన్ చేరుకుని రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రెండున్నరేళ్లుగా తనకు సహకరించిన సంకీర్ణ భాగస్వామ్యులైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ లు శరధ్ పవార్, సోనిగాంధీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించాలని ఉద్దవ్ థాక్రే అన్నారు. తన వాళ్లే తనను మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ సచివాలయం నుంచి వెళ్లిపోయారు.

అసెంబ్లీలో మొత్తం సీట్లు- 288

ప్రస్తుత సభ్యులు- 287

బీజేపీ ఎమ్మెల్యేలు- 106

శివసేన- 55, ఎన్సీపీ- 53, కాంగ్రెస్‌- 44

మ్యాజిక్ ఫిగర్- 144

Show Full Article
Print Article
Next Story
More Stories