Two Women Marriage: గ్యాస్ స్టవ్ సాక్షిగా ఏడడుగులు వేసిన ఇద్దరు యువతులు!

Two Women Marriage
x

Two Women Marriage: గ్యాస్ స్టవ్ సాక్షిగా ఏడడుగులు వేసిన ఇద్దరు యువతులు!

Highlights

Two Women Marriage Ceremony In Bihar: ఇద్దరు యువతులు ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా, కనీసం పురోహితుడు కూడా లేకుండా.. ఏకంగా వంటగదిలోని 'గ్యాస్ స్టవ్' సాక్షిగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

Two Women Marriage Ceremony In Bihar: సాధారణంగా పెళ్లి అంటే పందిళ్లు, బాజాభజంత్రీలు, వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా జరిగే ఏడడుగులు గుర్తుకు వస్తాయి. కానీ బిహార్‌లో జరిగిన ఒక వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు యువతులు ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా, కనీసం పురోహితుడు కూడా లేకుండా.. ఏకంగా వంటగదిలోని 'గ్యాస్ స్టవ్' సాక్షిగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

అబ్బాయిలంటే ఇష్టం లేకే..

బిహార్‌లోని సుపాల్ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. ఈ ఇద్దరు యువతులు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమాజం ఏమనుకున్నా పరవాలేదని, తమకు అబ్బాయిలంటే అస్సలు ఇష్టం లేదని వారు తెగేసి చెప్పారు. మగాళ్లపై ఆసక్తి లేకపోవడంతోనే, తాము ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాంతం కలిసి జీవించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

గ్యాస్ స్టవ్ సాక్షిగా ఏడడుగులు!

ఈ పెళ్లిలో మరో విచిత్రమైన అంశం ఏమిటంటే.. వీరు అగ్ని దేవుడికి బదులుగా వంటగదిలోని గ్యాస్ స్టవ్ వెలిగించి, దాని చుట్టూ ఏడడుగులు వేశారు. సంప్రదాయబద్ధంగా జరిగే మూడు ముళ్లు, తలంబ్రాల వంటి హడావిడి ఏమీ లేకుండానే ఒకరి చేయి మరొకరు పట్టుకుని తాము వివాహ బంధంతో ఒక్కటయ్యామని ప్రకటించారు.

నెట్టింట వైరల్..

ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు, భారీ కట్నకానుకల కోసం పాకులాడే ఈ రోజుల్లో.. ఇలా నిరాడంబరంగా, విభిన్నంగా పెళ్లి చేసుకోవడం చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ప్రేమకు హద్దులు లేవు" అని కొందరు అంటుంటే, "ఇదేం విడ్డూరం" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, తమ నిర్ణయంతో ఈ బిహార్ యువతులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.




Show Full Article
Print Article
Next Story
More Stories