Jharkhand: ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు మధ్యలో ఆదివారం!

Jharkhand: ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు మధ్యలో ఆదివారం!
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఇద్దరు పెళ్లాలు సినిమా మీకు గుర్తిందా.. 1954 ఎన్టీఆర్ , జమున, లక్ష్మీకాంతం కలిసి నటించారు.

ఇద్దరు పెళ్లాలు సినిమా మీకు గుర్తిందా.. 1954 ఎన్టీఆర్ , జమున, లక్ష్మీకాంతం కలిసి నటించారు. అప్పట్లో ఈ సినిమా వెండితెర ముందు చాలా ఏళ్లు ఆడింది. ఈ సినిమా కథ చూస్తే పిల్లలు లేని ఒక జమీందారు (సి.ఎస్.ఆర్)ను అతని భార్య రాధ (పి.వి.రాజమ్మ) పిల్లలకోసం రెండో పెళ్ళి చేసుకోమని మాటవరుసకు అడుగుతుంది. ఆ మాటను సాకుగా తీసుకుని సి.ఎస్.ఆర్ తాను ప్రేమించిన పుష్ప (లక్ష్మీకాంతం)ను పెళ్ళి చేసుకుంటాడు. కొంతకాలం సవతులిద్దరూ బాగానే ఉంటారు. అక్కడే అసలు సమస్య వస్తుంది భర్త సవతితో ఎక్కువగా గడుపుతుంటాడు. ఇది నచ్చక మరో ఎన్నో ఛాడీలు చెబుతుంది. వారిని వేరు చేయాలని చూస్తుంది. ఇక్కడ జార్ఖండ్ రాంచీలో జరిగిన కథ ఇలాంటిది కాకపోయినా.. కొంచెం ఆ సినిమాను పోలివుంటుంది.

జార్ఖాండ్ కు చెందిన రాజేష్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వారు అంతా కలిసి మెలిసి కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నారు. రాజేష్ తనను పట్టించుకోవడం లేదని మొదటి భార్యతోనే 5 రోజులు ఉంటున్నాడని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రాజేష్ అతని రెండో భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. రెండో భార్య దగ్గర ఎక్కువ సమయం ఉండకుడదని పోలీసులు రాజేష్‌కు చెప్పి పంపించారు.

అయితే కొన్ని రోజులు భాగానే ఉన్నా ఈ సారి మరో పెద్ద సమస్య పోలీసులకు వచ్చింది. రాజేష్ రెండో భార్య పోలీసులను ఆశ్రయించింది. భర్త రాజేష్ మొదటి భార్య దగ్గర ఎక్కువ రోజులు గడుపుతున్నాడని, తన దగ్గర ఉండడం లేదని వాపోయింది. దీంతో తలలు పట్టుకున్న పోలీసులు రాజేష్ ను అతని రెండో భార్యను స్టేషన్‌కు పిలిపించారు. మొదటి భార్య దగ్గర సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులు , రెండో భార్య దగ్గర గురువారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు ఉండాలిని, మిగిలిన ఒక రోజు ఆదివారం ఎక్కడైనా ఉండొచ్చని సలహా ఇచ్చి పంపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories