Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

Two Terrorists Killed in Encounter in Jammu and Kashmir
x

Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

Highlights

Jammu and Kashmir: ఒక ఏకే-47 రైఫిల్‌, ఒక పిస్టల్‌ స్వాధీనం

Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వనిగామ్‌పయీన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు... ఆప్రాంతాన్ని చుట్టుముట్టి టెర్రరిస్టులను లొంగిపోవాలని హెచ్చరించారు. సైనికుల హెచ్చరికలను పట్టించుకోని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్‌, ఒక పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాదులను షోపియాన్‌ జిల్లాకు చెందిన షకీర్‌ మజీద్‌ నాజర్‌, హనన్‌ అహ్మద్‌గా గుర్తించారు. ఉగ్రవాదులు ఇద్దరూ చాలా కాలంగా లష్కరే తోయిబాలో పనిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories