కూలిపోయిన ఇంట్లో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి

కూలిపోయిన ఇంట్లో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి
x
Highlights

కూలిపోయిన ఇంట్లో బాబు పేలడంతో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.. ఈ ఘటన..

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల బరాక్‌పూర్ సబ్‌డివిజన్‌లోని కమర్హతి వద్ద ఆదివారం సాయంత్రం ముడి బాంబు పేలడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గోలఘాట్ ప్రాంతంలోని కమర్హతి మునిసిపాలిటీలోని వార్డ్ నెంబర్ 2 వద్ద పేలుడు సంభవించింది. బాధితులు, ఇద్దరు యువకులను సాగర్ దత్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వారు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులను షేక్ రాజు (35), మహ్మద్ సాహిద్ గా గుర్తించారు. బరాక్‌పూర్ పోలీసు కమిషనర్ మనోజ్ బార్మా సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పేలుడు జరిగిన ప్రదేశం నుండి ఆధారాలు సేకరించారు. కూలిపోయిన ఇంటి లోపల ఈ పేలుడు సంభవించింది.

ఇంటి లోపల గది అంతా దుస్తులు, ఫర్నిచర్ భాగాలు, రక్తపు మరకలతో కనిపించాయి. పేలుడుకు కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు, ఉత్తర 24 పరగణ జిల్లాల్లోని బరాక్‌పూర్ ప్రాంతం 2019 నుండి రాజకీయ హింసకు కేంద్రంగా మారింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు అర్జున్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.. ఆ తర్వాత 2019 లో బిజెపి టికెట్‌పై బారక్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణలు ఈ ప్రాంతం మామూలుగానే జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారని బిజెపి నాయకత్వం ఆరోపిస్తోంది. అసలీ ప్రాంతంలోకి ముడి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు తమ దర్యాప్తును సాగిస్తున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories