రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ

రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ
x
Highlights

గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం తమ పదవులకు రాజీనామా చేయగా.. స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించారు.

గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం తమ పదవులకు రాజీనామా చేయగా.. స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించారు.దీంతో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లను కోల్పోయినట్టయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరిలు బుధవారం శాసనసభ స్పీకర్ త్రివేదిని కలిసి రాజీనామాలు సమర్పించారు. ఈ క్రమంలో గురువారం వారి రాజీనామాలను ఆమోదించినట్లు స్పీకర్ త్రివేది ప్రకటించారు. ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. కాగా అక్షయ్ పటేల్ వడోదర లోని కర్జన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, చౌదరి వల్సాద్ కప్రాడా సీటు నుండి గెలిచారు.

వాస్తవానికి బుధవారం, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిరిత్ పటేల్, లలిత్ వాసోయ, లలిత్ కగతారాగా లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్లను కలిశారు.. దాంతో వీరు బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే వీరు కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీకి షాక్ ఇచ్చారు. కాగా గుజరాత్‌లో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జూన్ 19న జరగాల్సి ఉంది. సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది, కానీ ఎమ్మెల్యేల రాజీనామాలు, జంపింగ్ లతో ఆ పార్టీ రెండవ సీటును గెలుచుకుంటుందా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బీజేపీ మాత్రం ముగ్గురు అభ్యర్థులను బరిలో ఉంచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories