Breaking : ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ ట్విట్టర్ ఖాతా హ్యాక్

Breaking : ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ ట్విట్టర్ ఖాతా హ్యాక్
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్, మొబైల్ యాప్ కు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని సోషల్ మీడియా..

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్, మొబైల్ యాప్ కు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ధృవీకరించింది. హ్యాక్ అయిన ఖాతాను తిరిగి భద్రపరచడానికి చర్యలు తీసుకున్నామని, పరిస్థితిని చురుకుగా పరిశీలిస్తున్నామని ట్విట్టర్ తెలిపింది. ఇదే సమయంలో, అదనపు ఖాతాలు ప్రభావితమవుతున్నాయన్న విషయం తమకు తెలియదు అని ట్విట్టర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. జూలైలో ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన అనేక ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేసిన విషయం బయటకు వచ్చిన తరువాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పీఎం నరేంద్ర మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్‌తో అనుసంధానించబడిన ధృవీకరించబడిన ట్విట్టర్ ఖాతాకు 2.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ప్రధాని మోదికి సంబంచిందిన వ్యక్తిగత వెబ్‌సైట్ లోని సమాచారాన్ని ఈ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఇందులో సంబంధంలేని పోస్టులు వస్తున్నాయి. కాగా ఈ ఖాతాను 2011 సంవత్సరంలో నరేంద్రమోదీ ఓపెన్ చేశారు. మరోవైపు సాక్షాత్తు ప్రధానికి చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అవ్వడంపై ప్రభుత్వం యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఏమి జరిగిందో ఎంక్వయిరీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే పేస్ బుక్ కు కూడా ఈ తరహా ఇబ్బందులు గత కొద్ది రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు రెండుసార్లు లేఖ రాసింది. అలాగే బుధవారం తృణముల్ కాంగ్రెస్ కూడా లేఖ రాసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories