TVK chief Vijay: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే వర్సెస్ డీఎంకే: విజయ్ సంచలన వ్యాఖ్యలు

TVK chief Vijay: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే వర్సెస్ డీఎంకే: విజయ్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

TVK chief Vijay: తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలో తమ పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కళగం), అధికార డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ స్పష్టం చేశారు.

TVK chief Vijay: తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలో తమ పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కళగం), అధికార డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నమక్కల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అనుకున్నవి సాధించలేదు...

"డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. అమలుకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేశారు" అని విజయ్ ఆరోపించారు. తమ పార్టీ టీవీకే మాత్రం కేవలం ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ప్రజలకు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

బీజేపీతో పొత్తు ఉండదు...

బీజేపీతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎప్పటికీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయ్ కుండబద్దలు కొట్టారు. "అవకాశవాద రాజకీయాలతో తమిళనాడుకు ద్రోహం చేయబోము. ఈ రోజు డీఎంకేకు ఓటు వేస్తే అది పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్లే. ఎందుకంటే డీఎంకే, కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందం చేసుకుంది" అని ఆయన ఆరోపించారు.

మహిళల భద్రత, రోడ్లపై దృష్టి...

రాబోయే రోజుల్లో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడితే, రోడ్లు, పరిశుభ్రమైన తాగునీరు, ప్రజల ఆరోగ్యం, మహిళల భద్రత వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. "ఆకాశంలో కోటలు కట్టే ఆలోచన మాకు లేదు. అమెరికా లాంటి రోడ్లు నిర్మిస్తామని అసాధ్యమైన హామీలు ఇవ్వం. ఆచరణ యోగ్యమైన పనులనే చేస్తాం" అని ఆయన అన్నారు.

నమక్కల్‌లోని తమిళ స్ఫూర్తిని ప్రశంసిస్తూ, అణగారిన వర్గాల రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడిన పి. సుబ్బరాయన్‌ను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories