అమెరికా అధ్యక్షుడి కారు ప్రత్యేకతలు తెలిస్తే షాక్‌

అమెరికా అధ్యక్షుడి కారు  ప్రత్యేకతలు తెలిస్తే షాక్‌
x
ట్రంప్ కారు
Highlights

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన కొనసాగుతోంది.

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన కొనసాగుతోంది. భారత్ చేరుకున్న ట్రంప్ మెలనీయా దంపతులకు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం ఆయన సతీమణితో కలిసి తాజ్ మహల్ అందాలను సందర్శించారు. కాగా.. ట్రంప్ భద్రత విషయంలో జాగ్రత్తగా ప్రయాణించే కారు 'ద బీస్ట్‌' గురించి తెలుసుకుంటేనే అర్థంమవుతోంది. ట్రంప్ 22 కి.మీ.రోడ్డు ప్రయాణం చేశారు. ఆయన ప్రయాణం అమెరికా నుంచి వచ్చిన కార్లలోనే కొనసాగింది.

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే 'ది బీస్ట్' కారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు. దీన్ని "కాడిలాక్ వన్," ఫస్ట్ కార్" అని కూడా పిలుస్తుంటారు.1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత ఆ దేశ అధ్యక్షుడి కారును భద్రత పెంచాలని అమెరికా ప్రభుత్వం భావించిందిట్రంప్‌ వాడుతున్న కాడిలాక్‌ కారు మోడల్‌ 2018 సెప్టెంబర్‌ 24న ఆ‍యన కాన్వాయ్ లో చేరింది. అధునాతన సౌకర్యాలతో, భద్రతా ప్రమాణాలతోకారును తయారు చేశారు.అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించిన ఈ కారు తప్పని సరిగా తీసుకువెళ్తారు. వందకోట్ల రూపాయలుపైగానే దీని ఖరీదు ఉంటుంది.

1.బీస్ట్‌ టెక్నాలజీ కారు బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీ గ్లాస్‌తో దీనిని డిజైన్ చేశారు. అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ) ఎంపిక చేసిన సీక్రెట్ ఏజెంట్ మాత్రమే డ్రైవర్ గా వ్యవహరిస్తారు.

2.బీస్ట్‌కు కారుకు సమీపంలో శక్తివంతమైన బాంబులు పేలినా లోపల ఉన్న ప్రెసిడెంట్ ఏమీ కాదు.

3. కారులో రాత్రి సమయాల్లో ప్రయాణించేటపుడు నైట్‌ విజన్‌ కెమెరాలు ఉంటాయి. కారు డోర్స్ 8 అంగుళాలు మందంగా ఉంటుంది.

4. రసాయన ఆయుధ దాడిని కూడా ఈ కారు తట్టుకోకలుగుతోంది.

5. టైర్లు పగిలిపోవు పంక్చర్ కావు. ఒకవేళ డ్యామేజ్ అయినా.. లోపల స్టీల్ రిమ్ లతో ప్రయాణించే సామర్థ్యం ఉంది.

6. ఈ కారు నుంచే గన్ ఫైర్ చేయవచ్చు.

7. ప్రమాదం జరిగితే అధ్యక్షుడిని కాపాడటానికి ఆక్సిజన్, అతని గ్రూప్ రక్తం వంటి సదుపాయాలు ముందుగానే భధ్రపరుస్తారు.

8. ఎమర్జెన్సీ పరిస్థితిలో కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో చర్చించేదుకు వీలుగా శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

9. కారు డ్రైవర్ వద్ద డాష్ బోర్డులో కమ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి.

10. సెల్ టవర్ కూడా కారులో ఉంది. మొత్తం ఇలాంటి కార్లు 12 ట్రంప్ కాన్వాయ్ లో ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories