భారత్-అమెరికా..అదిరిపోయే డీల్స్.. 21 వ శతాబ్దంలోనే ఇదొక కీలక ఘట్టం : మోడీ

భారత్-అమెరికా..అదిరిపోయే డీల్స్.. 21 వ శతాబ్దంలోనే ఇదొక కీలక ఘట్టం : మోడీ
x
భారత్-అమెరికా..అదిరిపోయే డీల్స్
Highlights

భారత్‌, అమెరికా దేశాల మధ్య రక్షణ రంగంలో మూడువేల బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. మెడికల్ ఉత్పత్తులు, మెంటల్ హెల్త్, ఇండియన్ ఆయిల్, చార్ట్ ఎనర్జీ,...

భారత్‌, అమెరికా దేశాల మధ్య రక్షణ రంగంలో మూడువేల బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. మెడికల్ ఉత్పత్తులు, మెంటల్ హెల్త్, ఇండియన్ ఆయిల్, చార్ట్ ఎనర్జీ, కెమికల్స్ అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.

న్యూఢిల్లీలోని హైద్రాబాద్ హౌస్ లో ప్రధాన మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. పలు అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. భారత్ అమెరికా దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలకమైన ఒప్పందాలపై అవగాహనకు వచ్చామని అమెరికన్ ప్రెసిడెంట్‌ ట్రంప్ చెప్పారు. భారత్‌కు అత్యంత అధునాతనమైన అపాచీ, MH 60 రోమియో హెలికాప్టర్లను అందజేయనున్నామని ట్రంప్‌ తెలిపారు.

ఇండియా– అమెరికా మధ్య సుమారు రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని వివరించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించామన్నారు. భారత్ కు పెద్ద మొత్తంలో సహజ వాయువు సరఫరాకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరిందని చెప్పారు.

ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి ఇరు దేశాల పౌరులకు భద్రత కల్పించుకునే విషయంపైనా చర్చించామని ట్రంప్ చెప్పారు. పరస్పర ప్రయోజనాలను పరిరక్షించుకునేలా పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. పాక్ కేంద్రంగా పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు అమెరికా కృషి చేస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద నిరోధం అంశాల్లో అమెరికా, భారత్ తోపాటు ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో సహకారం కొనసాగుతుందని తెలిపారు.

భారత్–అమెరికా దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలను ప్రారంభించినట్టుగా మోడీ స్పష్టం చేశారు.

దౌత్య సంబంధాల్లో రక్షణ సహకారం అత్యంత కీలకమైందని మోడీ చెప్పారు. గత మూడేళ్లలో భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో రెండంకెల వృద్ధిని సాధించినట్టుగా మోడీ గుర్తు చేశారు. భారత రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు త్వరలో సమకూరనున్నాయని మోడీ తెలిపారు. భారత్‌-అమెరికా మైత్రి 21వ శతాబ్దంలోనే కీలక ఘట్టమని ప్రధాని మోడీ అభివర్ణించారు. ట్రంప్‌ తాజా పర్యటన ఇరు దేశాల సంబందాలను మరింత బలోపేతం చేసిందని మోడీ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories