సామాజిక దూరం కోసం బైక్‌ను తయారు చేశాడు...

సామాజిక దూరం కోసం బైక్‌ను తయారు చేశాడు...
x
Electric Bike
Highlights

కరోనారాకుండా ఉండాలి అంటే మనిషి మనిషికి కొంత దూరం ఉండాలి అన్నది అందరికి తెలిసిన విషయం..

కరోనారాకుండా ఉండాలి అంటే మనిషి మనిషికి కొంత దూరం ఉండాలి అన్నది అందరికి తెలిసిన విషయం.. అందులో భాగంగా ప్రపంచం మొత్తం సామాజిక దూరం పాటించాలన్న ఉద్ద్యేశంతో లాక్ డౌన్ ను విధించాయి వివిధ దేశాలు.. అయితే త్రిపుర రాజధాని అగర్తాలలో నివసిస్తున్న పార్థ సాహా అనే వ్యక్తి వినూతనంగా ఆలోచించాడు.. సామాజిక దూరంతో ప్రయాణించడం కోసం ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశారు.. 2 సీట్ల మధ్య 1 మీటర్ కంటే ఎక్కువ దూరం ఉండటం ఈ బైక్ స్పెషాలిటీ.. దీనికి 'కోవిడ్ -19 బైక్' అని పేరు కూడా పెట్టారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఈ బైక్ ద్వారానే తన కుమార్తెను పాఠశాలకు తీసుకువెళతామని ఆయన చెప్పారు.

ఇది 48 వోల్ట్ల బ్యాటరీకి అనుసంధానించబడిన 750 వాట్ల మోటారును కలిగి ఉంది. దీనికి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే కనీసం 80 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇదిలావుంటే దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 37 వేల 654 కు పెరిగింది. గత 24 గంటల్లో గరిష్టంగా 1061 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 26.65% కి పెరిగింది. కోవిడ్ భారిన పడిన 10 వేల 18 మందికి నయం కాగా.. దురదృష్టవశాత్తు 1223 మంది మరణించారు. ప్రస్తుతం 26 వేల 535 మంది చికిత్స పొందుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories